Search

Monday, 10 April 2017

Prabhas 3 Roles in Baahubali Movie I బాహుబలి 2 కాదు 3వ పార్ట్ కూడా ఉంది తెలుసా?


బాహుబలి 2 అటూ ఇటుగా 15 రోజుల గ్యాప్ లో విడుదల అవ్వబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ గట్టిగానే నడుస్తున్నా ఆఖరి వారం రోజుల్లో సూపర్ సెన్సేషన్ తో ప్రమోషన్ ప్లాన్ చేసింది సినిమా బృందం, సినిమా మీద జనాల్లో ఉన్న ఆసక్తి ఇప్పటికే రెట్టింపు అవ్వగా కొత్తగా ఈ సినిమాకి సంబంధించి వస్తున్న న్యూస్ ఇంకా ఆసక్తిని రేపుతోంది. బాహుబలి2లో కొత్త పాత్రలు ఉండవు అని రాజమౌళి చెప్పాడు కానీ.. ఇందులో మరో కీలక పాత్ర పరిచయం కానుందట. అదే.. ధర్మేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి.. మహేంద్ర బాహుబలి పాత్రలు ప్రభాస్ చేశాడు. మరి కొత్తగా ఈ 3వ బాహుబలి అంటూ ఉంటే ఎవరు చేసి ఉంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే.. ఈ ధర్మేంద్ర బాహుబలిగా కూడా ప్రభాస్ కనిపిస్తాడట. అమరేంద్ర బాహుబలికి తండ్రి పాత్రే ఈ ధర్మేంద్ర బాహుబలి. తొలి భాగంలో కనిపించకుండానే కథలో భాగంగా వినిపించిన ఈ పాత్ర.. రెండో భాగంలో కీలకంగా ఉండనుందిట. ఈ విష‌యాన్ని క‌థార‌చ‌యిత విజ‌యేంద్రుడు ఇదివ‌ర‌కూ చూచాయ‌గా వెల్ల‌డించారు. కానీ అది అప్పుడు ఎవ‌రికీ అర్థం కాలేదు. ఎలాగోలా ఇప్పుడు మాత్రం ప‌సిగ‌ట్టేశారు సినీ జ‌నం. ఎవ‌రికీ తెలీకుండా ఈ ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్‌ని రాజమౌళి చాలా సీక్రెట్‌గా ఉంచాడని సినీ విశ్లేషకులు కథనాలు రాస్తున్నారు. మొదటి భాగంలో ఆ పాత్ర‌ను పూర్తి సస్పెన్స్‌లో ఉంచాడని పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఆ క్యారెక్ట‌ర్ అస‌లు గుట్టు బ‌య‌టికి లీకైందంటున్నారు

No comments:

Post a Comment