Search

Tuesday, 7 June 2016

అక్కడ ఇంటింటికి బీర్ పైప్ లైన్.. మందు బాబులకు పండగే! | beer pipelines in belgium


మీ ఇంటికే డైరెక్ట్ గా నల్లా నుండి నీళ్ళు పట్టుకున్నట్టుగా, బీర్ వస్తే ఎలా ఉంటుందో ఉహించుకోండి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా!. నల్లా కనెక్షన్ లాగే ఇంటింటికి బీర్ వచ్చేలా ఓ బీర్ కంపెనీ పైప్ లైన్ వేస్తామని ప్రకటించింది. బెల్జియంలోని బ్రుగేస్ నగరంలో ఓ బీర్ కంపెనీ ఉంది దాని పేరు డీ హల్వే మాన్ బ్రేవరీస్.. ఓనర్ గ్జావియార్ బెనస్డే. కొంతకాలంగా కంపెనీ అమ్మకాలు విపరీతంగా తగ్గిపోవడంతో ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. బ్రుగేస్ నగరానికి 3 కిలో మీటర్ల దూరంలో తన బీర్ కంపెనీ ఉంది. బ్రుగేస్ ను చారిత్రాత్మక నగరంగా అక్కడి ప్రభుత్వం గుర్తించింది. దీంతో అక్కడున్న పలు కట్టడాలు సంరక్షణ కూడా చూసుకుంటుంది. 

                                                                              ఇక కంపెనీ నుండి బ్రుగేస్ వెళ్ళే రోడ్లన్నీ చాలా వంకరటింకరగా, ఇరుకుగా ఉన్నాయి. కొన్ని చాలా కీలక మలుపులు, కాలువలు కూడా ఉండటంతో బీరు బాటిళ్ళు తీసుకెళ్ళే ట్రక్కు లకు ఇబ్బంది గా మారింది. రోడ్లు వెడల్పు చేయాలనీ అధికారులను కోరినా వారు అభ్యంతరం తెలిపారు. ఇక గోడౌన్ నుండి కంపెనీ కి పైప్ లైన్ వేసి దాని ద్వారా బీరు ను సరఫరా చేద్దామని నిర్ణయించాడు. దీని కోసం ఏకంగా 31 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న పైప్ లైన్ కొన్ని చోట్ల భూమికి 100 మీటర్ల లోతులో, మరి కొన్ని చోట్ల 6 అడుగుల లోతులో నిర్మిస్తున్నారు. ఇలా మొత్తం మూడు పైప్ లైన్లు ఉంటాయట. ఈ పైప్ లైన్ పనులు పూర్తి అయితే గంటకు 1500 గాలన్ల బీరు సరఫరా చేసే అవకాశం ఉందట. ఇది అసలు విషయం. 
మన దేశంలో కూడా ఇలా ఉంటె మందు బాబులకు ఇక పండగే పండగ!.

#News #WorldNews #beer #Drinking #alcohol #TrendingNews #trending #trendingVideos #Popular #TeluguTrending #Newsblog #blog #telugunews

No comments:

Post a Comment