Search

Thursday, 26 May 2016

Whatsapp Users need to be Alert!!



స్మార్ట్ ఫోన్ ల వాడకం చాలా ఎక్కువైపోయింది. చిన్న, పెద్ద అందరు మొబైల్ వాడుతున్నారు. మొబైల్ అనేది మన నిత్యావసరంగా మారిపోయింది. మాములు మొబైల్ కాకుండా స్మార్ట్ ఫోన్ అనేది ఈ రోజుల్లో తప్పనిసరి. ఈ స్మార్ట్ ఫోన్ వాడకంలో భాగంగానే అందరూ తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండేందుకు సోషల్ నెట్వర్క్ సైట్లను, వాటికీ సంబందించిన అప్ లను డౌన్లోడ్ చేస్కుంటారు. అందులో ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయిగించే అప్ వాట్సప్. ఇప్పుడు ఈ వాట్సప్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కన్నువాట్సప్ పై పడిందట.

                      జిమెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ల పాస్ వర్డ్స్ ని దొంగిలించి అన్ వాంటెడ్ మాల్వేర్ యూజర్లకు ఇబ్బంది కలిగిస్తున్న సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు వాట్సప్ పై పడింది. వాట్సప్ కి అప్ గ్రేడ్ వెర్షన్ అంటూ వాట్సప్ గోల్డ్ ను నెటిజన్లకు పంపుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. ఈ అప్ ను ఓపెన్ చేసారు అంటే ఇక అంతే. వాట్సప్ గోల్డ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మాల్వేర్ వైరస్ వచ్చి స్మార్ట్ ఫోన్ పడువుతుందని టెక్ నిపుణులు చెపుతున్నారు. వాట్సప్ వారు ఈ విషయంపై అధికారికంగా ప్రకటించే వరకూ ఇలాంటివి నమ్మొద్దు అని సూచిస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి .. సుమీ..!

No comments:

Post a Comment