Search

Friday, 27 May 2016

జనతా గ్యారేజ్ టీజర్ పై ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ .. | Janatha Garage Teaser Release Postponed


జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' మూవీ ట్రైలర్ విడుదలపై ఒక షాకింగ్ న్యూస్ బయటకు వొచ్చింది. తారక్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పవొచ్చు. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని 'జనతా గ్యారేజ్' టీజర్ ని రిలీజ్ చేస్తాం అని చెప్పిన ఆ చిత్ర యూనిట్. ఇప్పుడు అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ మూవీ టీజర్ ని విడుదల చేయడం లేదని తెలిపింది. ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. 'జనతా గ్యారేజ్' టీజర్ ని వచ్చే నెల జులై 8వ తేదిన రంజాన్ పర్వదినం సందర్భంగా రిలీజ్ చెయ్యాలని చిత్ర టీం అనుకుంటున్నారట. ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడిస్తారట. తమ అభిమాన నటుడు తాజా చిత్రంలో ఎలా కనిపిస్తాడో అనుకున్న ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారట. 

     జనత గ్యారేజ్ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని బిన్నీ మిల్స్ లో జరుగుతోందట. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే ఒక ఫైట్ సీన్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొంతమంది ఫైటర్స్ పై తెరకేక్కిస్తున్నారట. ఈ సీన్ తర్వాత కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రికరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాఫియా డాన్ గాను, ఐఐటీ స్టూడెంట్ గాను కనిపించి కనువిందు చేయనున్నాడు. మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' వంటి భారీ హిట్ కొట్టిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రని పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమాంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

#JanathaGarage #JrNtr #Tarak #JanathaGarageTrailer #JanathaGarageTeaser #Samantha #MaithriMovieMakers #Maheshbabu #DeviSriPrasad #DSP #MohanLal #NtrBirthday

No comments:

Post a Comment