Search

Wednesday, 25 May 2016

Camel Killed Owner in Rajasthan | మనిషిని చంపి తినేసిన ఒంటె


ఎండలు మండిపోతున్నాయి. మధ్యహ్నం పుట బయటకు వెళ్ళాలి అంటే ఎండా దెబ్బకు బయపడాల్సి వస్తుంది. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొన్న మన దేశ రాజధాని దెగ్గర ఉన్న నగరంలో రోడ్లు కరిగిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనికి సంబందించిన వీడియోలు కూడా సోషల్ నెట్వర్క్ లలో హల్చల్ చేసాయి. ఈ ఎండా దెబ్బకు తట్టుకోలేకే ఒక ఒంటె మనిషిని చంపి తినేసింది. అదేంటి ఒంటె మనిషిని చంపి తినడమా? అలాంటి వార్తలు ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా? ఐతే మేటర్ లోకి వెళ్ళాల్సిందే..

రాజస్తాన్ కి చెందిన బర్మేర్ జిల్లాలో ఒక ఒంటె తన ఓనర్ ని చంపి అతడి తలని తినేసింది. అది అలా ఎందుకు చేసింది అంటే ఆ ఓనర్ ఒంటె ను కాళ్ళు కట్టేసి ఎండలో వదిలేశాడట. జాతీయ మీడియా కథనం ప్రకారం మంగ్త అనే గ్రామానికి చెందిన ఒంటె ఓనర్ బిజీగా ఉండటం వల్ల ఆ ఒంటె ను శనివారం సాయత్రం ఆ ఒంటె ఎక్కడికి వెళ్ళకుండా కాళ్ళు కట్టేసాడట. ఓనర్ తన పనిలో మునిగిపోయి ఒంటెను మర్చిపోయాడు. ఆ ఒంటె రోజు మొత్తం ఎండలోనే గడిపింది. మరుసటి రోజు ఓనర్ వచ్చి కాళ్ళకు ఉన్న కట్లను విప్పడానికి ప్రయత్నించగా, కోపంతో ఉన్న ఆ ఒంటె తన నోటితో ఓనర్ తల ని మెడ నుండి వేరుచేసి అతన్ని నేలపై పడేసిందట. తర్వాత తలని, శరీరాన్ని కొరికి కొరికి తిన్నదట. ఆ ఒంటె ఓనర్ పై దాడి చేయడం ఇదేం మొదటి సారి కాదు అని గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ ఎండల్లో మనం ఒక్క నిమిషం కూడా ఉండలేం. అలాంటిది ఆ ఒంటె రోజు మొత్తం ఉంది. రాజస్తాన్ లో 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందిట. మనుషుల లాగే జంతువులు, పక్షులు ఎండ వేడిని తట్టుకోలేక పోతున్నాయి. వాటి మీద కూడా మనం కొంచెం దయ చూపించాలి కదా అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

#Camel #Rajasthan #HeatWave #Summer #Temperature #TrendingNews #shocking #WebExclusive #Angry #OwnerKilledbyCamel

No comments:

Post a Comment